సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 7 అక్టోబరు 2017 (20:33 IST)

అత్తతో వివాహేతర సంబంధం... అత్తతో కలిసి మామను చంపిన అల్లుడు...

హైదరాబాదులో మూడు రోజుల క్రితం రఫీక్ దారుణ హత్య వెనుక వున్న మిస్టరీని మూడు రోజుల్లో పోలీసులు ఛేదించారు. హత్య వెనుక వివాహేతర సంబంధమే కారణమని విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే... మెహిదీపట్నం డివిజన్‌ మురాద్‌నగర్‌కు చెందిన ఫరీద్‌ అహ్మద్‌ కూతురు అబర్నా

హైదరాబాదులో మూడు రోజుల క్రితం రఫీక్ దారుణ హత్య వెనుక వున్న మిస్టరీని మూడు రోజుల్లో పోలీసులు ఛేదించారు. హత్య వెనుక వివాహేతర సంబంధమే కారణమని విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే... మెహిదీపట్నం డివిజన్‌ మురాద్‌నగర్‌కు చెందిన ఫరీద్‌ అహ్మద్‌ కూతురు అబర్నార్‌ను సనత్‌నగర్‌ డివిజన్‌ కైలాస్‌నగర్‌కు చెందిన రఫీక్‌కు ఇచ్చి 2015 మే 11న వివాహం చేశారు. పెళ్లయిన తర్వాత రఫీక్ సౌదీలో ఉద్యోగంలో చేరాడు. 
 
ప్రైవేటు కంపెనీలో అసిస్టెంటుగా పనిచేస్తూ భార్యకు 2016 డిసెంబరు నెలలో తన వద్దకు రమ్మని వీసా పంపాడు. దుబాయ్ వెళ్లిన అబర్నార్ నెల రోజులు అక్కడ వుండి ఆ తర్వాత తనక్కడ వుండలేననీ, హైదరాబాద్ వెళ్లిపోతానని గొడవ చేసింది. దీనితో చేసేదేమి లేక ఆమెను హైదరాబాద్ పంపాడు. తిరిగి వచ్చిన అబర్నార్ తన సొంత ఆడబిడ్డ కొడుకు వరసకు అల్లుడు అయిన యాసిన్‌తో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. 
 
దుబాయ్ నుంచి భర్త ఫోన్ చేసినా ఆమె ఆ కాల్స్ అటెండ్ చేయడం మానేసింది. దీనితో అతడు మౌనంగా వుండిపోయాడు. ఇదిలావుండగా సెప్టెంబరు 17న రఫీక్ తండ్రి మరణించడంతో అతడు తండ్రి అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో భర్తకు విషయం తెలిస్తే తమకు ఇబ్బంది తలెత్తుతుందని సెప్టెంబరు 30న తను వుంటున్న ఇంటికి రావాల్సిందిగా కబురు పెట్టింది అబర్నార్. ఇంటికి వెళ్లి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు రఫీక్. 
 
ఇదే అదనుగా ప్రియుడు యాసిన్‌తో కలిసి అబర్నార్ తన భర్త మెడకు తాడు బిగించి అక్కడే వున్న పాత్రతో తలపై గట్టిగా మోది హతమార్చారు. చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. రఫీక్ ఎంతకీ రాకపోయేసరికి రఫీక్‌ సోదరుడి కొడుకు వచ్చి వాకబు చేయగా రఫీక్ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి వున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేసి నిందితులను గుర్తించారు. హత్య చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.