సెలైన్ బాటిల్‌లో బ్యాక్టీరియా...చూపును పోగొట్టుకున్న 13 మంది..?
హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి వైద్యుల నిర్వాకం వల్ల 13 మందికి కంటిచూపు పోయింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వైద్యులపై కేసు నమోదైంది. మెహిదీపట్నంలో ఉన్న ఈ ఆసుపత్రిలో గత గురువారం వీరికి కంటి శస
హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి వైద్యుల నిర్వాకం వల్ల 13 మందికి కంటిచూపు పోయింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వైద్యులపై కేసు నమోదైంది. మెహిదీపట్నంలో ఉన్న ఈ ఆసుపత్రిలో గత గురువారం వీరికి కంటి శస్త్రచికిత్స చేశారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితుల ఫిర్యాదుపై హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు.
కాగా, సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న 13 మంది రోగుల్లో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కళ్లు శుభ్రం చేసేందుకు వాడే సెలైన్ బాటిల్‌లో బ్యాక్టీరియా ఉన్నందువల్లే రోగులు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని విచారణాధికారి డాక్టరు రవీందర్ గౌడ్ పేర్కొన్నారు. ఆపరేషన్ జరిగి అయిదురోజులు కావస్తున్న వారికి కంటి చూపు రాలేదు.... సరికదా ఉన్న చూపు కూడా ఊడగొట్టినట్టయ్యింది.
పరిస్థితి తెలిసి ఆసుపత్రి డిప్యూటీ సూపరిటెండెంట్ రాజేంద్ర గుప్తా విచారణ చేపట్టారు. ఆపరేషన్‌కు ముందు కళ్లను శుభ్రంచేసే సెలైన్ వల్లే ఈ సమస్య ఏర్పడినట్టు గుర్తించారు. వాటిని ప్రభుత్వమే సరఫరా చేస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం తరుపున ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రికి వచ్చి మందులు పరిశీలించి వెళ్లారని తెలిపారు. ప్రభుత్వానికి ఎవరైన మెడిసిన్ సరఫరా చేశారో ఆ ఏజెన్సీదే బాధ్యతని అన్నారు. పరిస్థితి చక్కబడే వరకు వారం రోజుల పాటూ ఆపరేషన్లు ఆపేస్తున్నట్టు చెప్పారు. 13 మందికి చూపు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వైద్యబృందం తెలిపారు. సీఎం కేసీఆర్ దీనిపై విచారణకు ఆదేశించింది.