బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (15:44 IST)

యువతిని కరిచిన వీధికుక్క.. హైదరాబాదులో భయం భయం

dogs
హైదరాబాద్, అంబర్ పేటలో రెండ్రోజుల క్రితం నాలుగేళ్ల బాలికపై వీధికుక్కలు దాడి చేయడంతో ఆందోళనకు దిగాయి. వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కుక్కల దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటనలో ఓ యువతి తన స్నేహితులతో రోడ్డుపై నిలబడి మాట్లాడుతుండగా వీధికుక్క కరిచింది. 
 
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ల్యాంకోహిల్స్‌లో ఆదివారం సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ ఘటన సంచలనం సృష్టించింది. సీసీటీవీ ఫుటేజీలో ముగ్గురు యువతులు, ముగ్గురు యువకులు రోడ్డు పక్కన నిలబడి ఉండగా వెనుక నుంచి ఓ కుక్క వారి వద్దకు వచ్చింది. 
 
కుక్క పారిపోయే ముందు యువతులలో ఒకరి కాలుపై కరిచింది. బాధితురాలిని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె గాయపడి చికిత్స పొందుతోంది.