శనివారం, 26 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By chitra
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2016 (16:08 IST)

మన కులం కానోడ్ని ప్రేమిస్తావా.. నిన్ను బతకనీయమే... కన్నబిడ్డ మెడకు చున్నీ బిగించి చంపేశారు..!

దేశంలో పరువు హత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓ పరువు హత్య జరిగింది. తమ కుమార్తె మరో కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందన్న అక్కసుతో కన్నతల్లిదండ్రులో తమ బిడ్డను హత్య చేశా

దేశంలో పరువు హత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓ పరువు హత్య జరిగింది. తమ కుమార్తె మరో కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందన్న అక్కసుతో కన్నతల్లిదండ్రులో తమ బిడ్డను హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన చౌహాన్ లక్ష్మణ్ కుమార్తె అఖిల (17) అనే యువతి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు నేరడిగొండ తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మహేందర్‌తో పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకుని సరాదాగా షికార్లకు వెళ్లేవారు. ఇలా ఓ యేడాది గడిచిపోయింది. 
 
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అతడు అఖిలని కలుసుకోవడానికి ఇంటికి వచ్చాడు. అతడిని చూసిన అఖిల తల్లిదండ్రులకు కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై అఖిలకు ఎంత నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. 
 
దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు తెల్లవారుజామున అఖిలను చున్నీని మెడకు బిగించి చంపేశారు. వేరే కులానికి చెందిన యువకుడితో చనువుగా తిరగటం నచ్చక కూతురిని చంపేశామంటూ శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు లొంగిపోయారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ సంఘటన స్థలిని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.