శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (16:48 IST)

చెల్లెల్ని ప్రేమిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చినందుకు అన్నను చంపేసిన ప్రేమికుడు..

ఇప్పటివరకు మనం చాలా సందర్భాల్లో ప్రేమికులను బెదిరించి వారిని వేరు చేసిన వారిని చూసాము. అలాగే పరువు హత్యలు కూడా చూసాము. చెల్లెల్ని ప్రేమిస్తున్నాడని ప్రేమికుడిని చంపిన అన్నయ్యలు ఉన్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
 
తన చెల్లెల్ని వేరొకరు ప్రేమిస్తున్నారని తెలుసుకున్న అన్నయ్య ఆ ప్రేమికుడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ప్రియురాలి అన్నపై కక్ష పెంచుకున్న ప్రేమికుడు అతడిని కత్తితో పీక కోసి హత్య చేసాడు. ఈ దుర్ఘటన తెలంగాణలోని భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరిగింది.
 
పాల్వంచ తెలంగాణనగర్‌లో షకీల్ నివాసం ఉంటున్నాడు. తన చెల్లెల్ని శివశంకర్‌రెడ్డి అనే వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలుసుకుని తన స్నేహితుల సాయంతో అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తనను అవమానించినందుకు బాధపడిన శివశంకర్‌రెడ్డి షకీల్‌పై కక్ష పెంచుకున్నాడు. 
 
సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అయితే శివశంకర్‌రెడ్డి అదును చూసుకుని షకీల్‌ను హత్య చేసాడు. షకీల్‌ను కత్తితో మెడనరికి దారుణంగా చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.