గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 4 జులై 2019 (09:42 IST)

నిజామాబాద్ జిల్లాలో దారుణం.. వృద్ధురాలి చెవులు కోసి...

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. వృద్ధురాలి ముఖంపై, చెవులపై కోసి హత్య చేసి బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో సాయమ్మ అననే 70 సంవత్సరాల వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటలైనా లేవకపోవడంతో స్థానికులు వచ్చి తలుపు తెరిచి చూడగా రక్తపు మడుగులో కనిపించింది. 
 
పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సాయమ్మకు ఇద్దరు కుమారులు. ఒక కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు. మరో కొడుకు గల్ఫ్ దేశంలో ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటుంది. ఈ హత్య గల కారణాలను అన్వేషిస్తున్నాను త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు.