శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 3 మార్చి 2017 (14:49 IST)

పోలీసోడంటే ఇలాగేనా...? అతడు తప్పు చేశాడో లేదో కానీ భార్యను కాల్చి చంపేశాడు....

పోలీసోడంటేనే ఇలాగేనా అనే మాట వినబడుతోంది. పైఅధికారులు తనను సస్పెండ్ చేసినదానికి అతడు తనను తాను షూట్ చేసుకునే ముందు భార్యను కూడా కాల్చి చంపేశాడు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్‌ క్వార్టర్స్‌లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబుపై కొన్ని ఆరోపణలు రావడంతో అతడిని పైఅధికారులు గురువారం నాడు సస్పెండ్ చేశారు. దీనితో తీవ్ర మనోవేదనకు గురైన చిట్టిబాబు శుక్రవారం నాడు తన సర్వీస్‌ రివాల్వర్‌తో భార్యను కాల్చి చంపేశాడు. ఆ తర్వాత చిట్టిబాబు అదే రివాల్వర్‌తో తనను తాను కాల్చుకున్నాడు. 
 
తుపాకీ కాల్పుల శబ్దంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూడగా చిట్టిబాబు భార్య రక్తపుమడుగులో విగతజీవిగా పడివుంది. చిట్టిబాబు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. హుటాహుటిన అతడిని హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించారు. ఐతే అతడి పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు సమాచారం.