శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : బుధవారం, 21 జూన్ 2017 (11:00 IST)

ఫ్రీ వైఫై సిటీగా హైదరాబాదు.. తెలంగాణలో 2వేల హాట్ స్పాట్ ప్రాంతాలు..

తెలంగాణ ఐటీ మంత్రి హైదరాబాదును త్వరలో ఫ్రీ వైఫై సిటీగా మార్చనున్నారు. ఇప్పటికే ఈ పనులను పూర్తి చేశారు. హైఫై ప్రాజెక్టు పేరుతో ఇప్పటికే వెయ్యి హాట్‌ స్పాట్‌ ప్రాంతాలను ప్రభుత్వం వివిధ సంస్థల సహకారంతో ఏ

తెలంగాణ ఐటీ మంత్రి హైదరాబాదును త్వరలో ఫ్రీ వైఫై సిటీగా మార్చనున్నారు. ఇప్పటికే ఈ పనులను పూర్తి చేశారు. హైఫై ప్రాజెక్టు పేరుతో ఇప్పటికే వెయ్యి హాట్‌ స్పాట్‌ ప్రాంతాలను ప్రభుత్వం వివిధ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా.. షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, కళాశాలలు, పాఠశాలలు వంటి ప్రాంతాల్లో వైఫై హాట్ స్పాట్‌లను ఇంటర్నెట్ కంపెనీల అపెక్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ (కాయ్).. ఎయిర్‌ టెల్, ఏసీటీ ఫైబర్‌ నెట్, ఇండస్‌ టవర్, సీఓఏఐ, బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.
 
త్వరలో మరో 2వేవ ప్రాంతాల్లో హాట్ స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆయా సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. హాట్ స్పాట్‌ల ద్వారా5-10 ఎంబీపీఎస్ బ్యాండ్ విండ్త్ వేగంతో రోజూ 30 నిమిషాల పాటు ఉచిత ఇంటర్నెట్ హైదరాబాదు ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు నాణ్యతపై టెలికాం సంస్థలు పూర్తిగా దృష్టి పెట్టాయి. ఇప్పటికే ఢిల్లీలో ఈ విధానం అమలులో ఉంది.