జూన్ 15న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్‌బిఐఈ) ఇంటర్ ఫలితాలను జూన్ 15న ప్రకటించనుంది. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ sbie.cgg.gov.inలో తనిఖీ చేసుకోవచ్చు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు.
కాగా కోవిడ్ కారణంగా గతేడాది ఆల్‌పాస్ ఫార్ములాను ప్రకటించిన ఇంటర్ బోర్డు ఈ ఏడాది పరీక్షల ఫలితాలను ప్రకటించిన తేదీ కంటే ముందుగానే విడుదల చేసేందుకు సిద్ధమయ్యింది. మే 6 నుంచి 24 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరిగాయి.
ఐతే ఈ పరీక్షలు ప్రారంభమయినప్పనుంచి క్వశ్చన్ పేపర్లలో అక్షర దోషాలు, చేతితో రాసిన క్వశ్యన్ పేపర్ల పంపిణీ, ఒక పరీక్షకు బదులు మరో పరీక్ష పేపర్లను విద్యార్ధులకు ఇవ్వడం.. ఇలా పలురకాలుగా ఇంటర్ బోర్డు తప్పిదాలతో వార్తల్లో నిలిచింది.
మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. టెన్త్ పబ్లిక్ పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది.
ఈ ఏడాది జూన్‌లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మాత్రమే తరగతులను ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జులై 1 నుంచి ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.