శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 23 డిశెంబరు 2014 (10:39 IST)

జోష్ మీదున్న పవన్ నాయిక....! ఎందుకబ్బా..?!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'గబ్బర్ సింగ్ 2'లో నటిస్తున్న బ్యూటీ అనీషా ఆంబ్రోస్. ఈ అమ్మడు ఇప్పుడు మాంచి జోష్ మీదున్నానంటోంది. పవన్ సరసన ఛాన్స్ చిక్కినందుకా అంటే అది కాదట. మరెందుకమ్మా అని అడిగితే... క్రిస్మస్ పండుగను మేమంతా ఎంతో జోష్ తో చేసుకుంటాం అంటోందీ అమ్ముడు.
 
విశాఖకు చెందిన అనీషా తన క్రిస్మస్ సెలెబ్రేషన్స్ గురించి చెబుతూ, 'వారం రోజుల ముందే మా ఇంట్లో పండుగ వాతావరణం మొదలైంది. పలు చోట్ల ఉన్న మా కుటుంబీకులు అందరూ విశాఖ చేరుకునేశారు.
 
క్రిస్మస్ పండను సౌత్, నార్త్, వెస్ట్రన్.. ఇలా అన్ని రకాల సాంప్రదాయ పద్ధతులలోను చేసుకుంటాం. అలాగే స్వీట్స్ కూడా అన్ని ప్రాంతాలవీ తయారు చేస్తాం. క్రిస్మస్ పండగ వస్తోందంటే ఆ ఉత్సాహమే వేరు, ఆ సందడే వేరు. అందరికీ క్రిస్మస్ గ్రీటింగ్స్ అంటోంది. అన్నట్టు, పవన్ సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాననంటోందీ బ్యూటీ.