1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 17 అక్టోబరు 2014 (16:54 IST)

'రానే వచ్చాడు రామయ్య...' మోక్షజ్ఞ ఎంట్రీ టైటిల్...?

నందమూరి బాలకృష్ణ వారసునిగా మోక్షజ్ఞ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తను జిమ్నాష్టిక్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఒకవైపు చదువు, మరోవైపు నటనపై రాణించేందుకు శ్రద్ధ చూపిస్తున్నాడని తెలుస్తోంది. ఆమధ్య బాలకృష్ణను అడిగితే... అప్పుడే ఎందుకు? ఇంకా చదవాల్సిన వయస్సు అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కానీ మీడియా ఏదో ఒకటి చేసేదాక నిద్రపోదని కూడా సెటైర్‌ వేశారు.
 
కాగా, మోక్షజ్ఞ అమెరికాలో మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది. డాన్స్‌, యోగా, నటనతో పాటు స్విమ్మింగ్‌ కూడా అక్కడే శిక్షణ తీసుకుని రానున్నట్లు సమాచారం. కాగా, ఫిలిం ఛాంబర్‌ వివరాల ప్రకారం... 'రానే వచ్చాడు రామయ్య' అనే టైటిల్‌ను మోక్షజ్ఞ కోసం రిజిష్టర్‌ చేసినట్లు సమాచారం. మరి రామయ్య ఎప్పుడు వస్తాడో.. చూడాల్సిందే.