బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 27 ఏప్రియల్ 2024 (23:22 IST)

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

Strawberry
కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్ట్రాబెర్రీ ఆరోగ్యకరం అని వైద్య నిపుణులు చెబుతారు. ఆహారంలో స్ట్రాబెర్రీలను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
స్ట్రాబెర్రీలో పొటాషియం తక్కువగా ఉంటుంది, ఇది మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారికి మంచిది.
స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక కిడ్నీలకు మేలు చేస్తాయి.
ఫైబర్ అధికంగా ఉండే స్ట్రాబెర్రీలు తింటుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి.
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి గుండె ఆరోగ్యంగా వుండాలి, స్ట్రాబెర్రీలు దీనికి దోహదపడతాయి.
కిడ్నీ రోగులు తక్కువ భాస్వరం, సోడియం వున్న ఆహారాన్ని తినమంటారు. ఇవి స్ట్రాబెర్రీలలో వున్నాయి.
డయాలసిస్ చేయించుకుంటున్న వారు లేదా కిడ్నీ వ్యాధి ముదిరిన వారు స్ట్రాబెర్రీలను తీసుకోకూడదు.