స్ట్రాబెర్రీలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అన్నింటిలో సెల్ డ్యామేజ్‌ని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
స్ట్రాబెర్రీలోని యాంటీఆక్సిడెంట్లు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో మేలు చేస్తాయి.
బ్లాక్ బెర్రీలోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి.
స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే ఓరల్ క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.
స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
స్ట్రాబెర్రీలోని పొటాషియం రక్త ప్రసరణను క్రమబద్దం చేయడంతో హైబ్లడ్ ప్రెజర్‌ను నిరోధిస్తుంది.
టైప్ 2 డయాబెటిస్, గుండె ఆరోగ్య సమస్యలను నివారించడానికి స్ట్రాబెర్రీ బాగా సహాయపడుతుంది.
మెదడుకు కావలసిన అన్ని పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ బెర్రీస్ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.