రామానాయుడు అంతిమ యాత్ర... భారీగా తరలివచ్చిన అభిమానులు..!
సినీ సామ్రాట్, నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు భౌతిక కాయాన్ని రామానాయుడు స్టూడియోకు యాత్రగా తరలిస్తున్నారు. ఈ అంతిమ యాత్రకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రామానాయుడు స్టూడియోలో అభిమానుల సందర్శనార్ధం ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. సాయంత్రం 3 గంటలకు ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
రామానాయుడు భౌతిక కాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ సందర్శించించి నివాళులు అర్పించారు. సినీ సామ్రాట్ రామానాయుడు మృతితో సినీ పరిశ్రమ సోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి ఒక్క సినీ పరిశ్రమే కాదు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.