'ఎర్రబస్సు'కు పేరుకే దాసరి డైరక్టర్.. చేసేదంతా అసిస్టెంటే...!

dasari narayana rao
dasari narayana rao
PNR| Last Updated: సోమవారం, 14 జులై 2014 (11:24 IST)
తింగరగా మాట్లాడితే.... ఎర్రబస్సు ఎక్కివచ్చావా? అంటుంటారు.. సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్స్‌ బాగా ఉపయోగించే పదం ఇది. ఈ టైటిల్‌తో దాసరి నారాయణరావు గురుపౌర్ణమి నాడు లాంఛనంగా హనుమాన్‌ టెంపుల్‌లో పూజకార్యాక్రమాలతో సినిమా ప్రారంభించారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. ఇందులో దాసరికూడా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.

స్వంతగా కథలు తీసుకుని ఒకప్పుడు ఫేమస్‌ అయినా.. ఆ తర్వాత రానురాను తన కథలు ప్రేక్షకులకు పట్టకపోవడంతో... దాసరి ఇప్పటితరాన్ని ఆకట్టుకోలేకపోయాడు. బాలయ్యతో 'పరమవీరచక్ర'తో మరీ డీలా పడిపోయాడు. అందుకే ఈసారి తమిళ చిత్రం 'మంజపాయ్‌' హక్కులు పొందాడు.

దానికి ముందుగా తాతమనవడు అని పేరుపెడుతున్నట్లు చెప్పాడు. కానీ ట్విస్ట్‌ ఏమంటే... 'ఎర్రబస్సు'గా మార్చేశాడు. ఈనెల 24 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ రాజమండ్రి పరిసరప్రాంతాల్లో జరగనుంది. ఇప్పటికే నటీనటులు ఫైనల్‌ అమ్యారు. కేథరిన్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. దాసరి దర్శకుడే కానీ చేసేవన్నీ ఆయన అసిస్టెంట్లే.. మరి ఈ సినిమా ఎలా తీస్తాడో చూడాలి.
దీనిపై మరింత చదవండి :