2 వేల థియేటర్లలో మహేష్ బాబు 'ఆగడు'!

mahesh's aagadu
PNR| Last Updated: గురువారం, 11 సెప్టెంబరు 2014 (14:01 IST)
మహేష్ బాబు, తమన్నా జంటగా నటించిన చిత్రం "ఆగడు". ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ, పంపిణీ సంస్థ అయిన ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుని, రికార్డు స్థాయిలో దాదాపు 2 వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

'దూకుడు' తర్వాత మళ్లీ శ్రీను వైట్ల కాంబినేషన్లో మహేష్ నటించిన సినిమా కావడంతో ఆగడుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం బిజినెస్ కూడా
హాట్ కేక్‌లా రికార్డు స్థాయిలో జరిగిపోవడంతో హైఎక్స్‌పెక్టేషన్స్ నెలకొనివుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీత బాణీలను సమకూర్చాడు.దీనిపై మరింత చదవండి :