శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 14 మార్చి 2015 (09:45 IST)

శ్రుతితో లిప్ లాక్ ముద్దు వద్దు... ఎవరా హీరో...!

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ మూడు భాషల్లో క్రేజీ తారగా వెలుగుతున్న బ్యూటీ శ్రుతి హాసన్. ఈ లేతపరువాల భామతో లిప్ లాక్ ముద్దు చేయమంటే ఎవరైనా తిరస్కరిస్తారా?. అయితే బాలీవుడ్ హీరో  జాన్ అబ్రహాం మాత్రం నిర్మొహమాటంగా వద్దనేశాడు. 
 
ప్రస్తుతం ఈ జంట అనీజ్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న 'వెల్కమ్ బ్యాక్' ('వెల్కమ్'కి సీక్వెల్) సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ సందర్భంలో లిప్ లాక్ ముద్దు సీను వుందట. దర్శకుడు దీని గురించి చెప్పగానే ససేమిరా చేయనన్నాడట జాన్. దాంతో ఆ స్థానంలో ఓ రొమాంటిక్ సాంగును పెట్టినట్టు దర్శకుడు చెబుతున్నాడు.
 
అయితే, శ్రుతితో ఇలా ముద్దు సీను చేయననడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే, జాన్ అబ్రహాం ఇటీవలే అమెరికాకు చెందిన ఇన్వెస్టిమెంట్ బ్యాంకర్ ప్రియా రంచల్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలోనే భార్యామణి ఇకపై సినిమాల్లో లిప్ లాక్ సీన్లు చేయకూడదంటూ కండిషన్ పెట్టిందట. ఆవిడ గారి రూల్సుని ఈయనగారు ఇప్పుడు కచ్చితంగా పాటిస్తున్నాడన్న మాట!