శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: గురువారం, 19 జూన్ 2014 (13:23 IST)

చెల్లికి పెళ్లయ్యింది... నీకెప్పుడంటున్నారు... కాజల్ అగర్వాల్

పెళ్లి అనేది జీవితంలో ఎంత ముఖ్యమో తెలుసు. అందుకో తొందరపడదలచలేదని నటి కాజల్‌ అగర్వాల్‌ చెబుతోంది. హీరోయిన్లకు వయస్సు వస్తే చాలు పెళ్లెప్పుడు అంటుంటారు. సినిమాల్లో ఈజీగా లవ్‌ చేసుకుని ఎదిరించి మరీ చేసుకుంటారు. కానీ రియల్‌ లైఫ్‌లో అంత ఈజీగా జరగదని కాజల్‌ తేల్చి చెబుతోంది. ఇటీవలే ఆమెను పెండ్లి గురించి అడిగితే స్పందించింది. 
 
పెండ్లికి తొందరలేదు. త్వరలో అందరికీ చెప్పి చేసుకుంటానంటోంది. చెల్లెలికి పెండ్లయినా ఇంకా చేసుకోలేదని చాలామంది అడుగుతున్నారు. కానీ అందుకు నా కుటుంబమంతా నాకు సపోర్ట్‌గా నిలిచారు. ప్రస్తుతం చేతిలో సినిమాలున్నాయి. అవి అయ్యాక ఆలోచిస్తానని చెబుతోంది. అయితే ముంబై వ్యాపారవేత్తను పెండ్లి చేసుకోబోతుందని వస్తున్న వార్తను ఆమె ఖండించింది. ఇలాగే అమలాపాల్‌ కూడా మొదట్లో ఖండించి ఆ త ర్వాత ఆ వార్తను నిజం చేసింది.