శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : సోమవారం, 18 మే 2015 (20:56 IST)

NATS అంతర్జాతీయ చిత్రలేఖన పోటీలు

కేలిఫోర్నియా-NATS జూలై 2, 3, 4 తేదీలలో, లాస్‌ఏంజిల్‌లో NATS నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాలను పురస్కరించుకొని  ప్రఖ్యాత గ్రీటింగ్ కార్డు తయారీ సంస్థ Greetway కంపెనీతో NATS సంయుక్తంగా 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ సందర్భంగా,  పోటి ప్రకటన పత్రాన్ని ప్రఖ్యాత గజల్ గాయకుడు డా॥గజల్ శ్రీనివాస్, డా॥ ఆలపాటి రవి లాస్‌ఏంజిల్లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.
 
ఈ కార్యక్రమంలో నాట్స్  ప్రెసిడెంట్  రవి ఆచంట, సంచాలకులు ఆలపాటి రవి, ప్రసాద్ పప్పుదేసి మరియు గ్రీట్వే అధినేత రమేష్ వడలి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జేర్మి డాసన్ తదితరులు పాల్గొన్నారు. 18 సంవత్సరాల లోపు ఉన్న యువతీయువకులు, బాలబాలిలలో చిత్ర కళా నైపుణ్యాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు జేర్మి డాసన్ తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనదలచిన వాళ్ళు  కాన్వాస్ పైన కానీ, ఆర్ట్ పేపర్ మీద కానీ 8" అంగుళాలు కనీసం మరియు 32"అంగుళాలు గరిష్ట పరిమాణాలలో వాటర్ కలర్స్ కానీ ఆయిల్ కలర్లో కానీ వేసిన చిత్రాలను జూన్ 20 లోపు  గ్రీట్వే కార్యాలయానికి చేరేట్లు పంపాలని నిర్వాహకులు తెలిపారు. పోటీ వివరాలు  sambaralu.org/kidscompetitions/painting-competitions.html లో పొందుపరిచారు. ఈ చిత్రలేఖ పోటీలలో తెలుగు సంస్కృతి, ప్రపంచ శాంతికి సంబంధించిన అంశాలపై ఉండాలని తెలిపారు
 
ఈ పోటీని మూడు విభాగాలుగా నిర్వహిస్తున్నట్లు , అవి అమెరికాలో ఉన్న బాలబాలికలకు 13 సంవత్సరాల లోపు జూనియర్ విభాగం, 13 ఏళ్ల నుండి 18 సంవత్సరాల లోపు సీనియర్ విభాగం, అంతర్జాతీయంగా 18 సంవత్సరాల లోపు  అతిథులుగా పేర్కొన్నారు. ప్రతి విభాగానికి మొదటి బహుమతి 500 డాలర్లు, రెండవ బహుమతి 300 డాలర్లు, మూడువ బహుమతి 150 డాలర్లుగా ప్రకటించారు.  చిత్రలేఖన పోటీలో పాల్గొన్న ప్రతివారికీ ప్రసంశా పత్రాన్ని అందచేయనున్నట్లు తెలిపారు. ఎంపిక చేయబడిన 50 చిత్రాలను నాట్స్ సంబరాలలో ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కలిగిన బాలబాలికలు ఈ పోటీలో పాలుపంచుకోవాలని రవి ఆచంట తెలిపారు.