మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Hanumantha Reddy
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2015 (17:30 IST)

ఆకతాయిల చెంప "చెళ్లు"మనిపించిన సమంత..!!

ఏమాయ చేసావే చిత్రంతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసి తెలుగు ప్రేక్షకుల మనస్సును దోచుకున్న అందాల ముద్దుగుమ్మ సమంతకు చేదు అనుభవం ఎదురైంది. 

ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సమంతను ఆమె ఆభిమానులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేయడమే కాక శరీరాన్ని తమ చేతులతో తడమడం మొదలెట్టారట.

దీంతో సమంత కోపం కట్టలు తెంచుకుంది. అభిమానులన్న విషయాన్ని సైతం మరిచిపోయి వారి చెంపలను చెళ్లుమనిపించిదట. దీంతో ఆ కార్యక్రమం రసాభాస అయింది. మరి ఆ ఆకతాయిలు ఏం చేస్తే.. సమంతకు అంత కోపం వచ్చిందో...!?