మంగళవారం, 22 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

తమన్నా... నాతో నటిస్తావా...?: షారుక్ ఖాన్

గజినీ హీరోయిన్ అసిన్‌ను తన తదుపరి చిత్రంలో నటించాల్సిందిగా షారుక్ ఖాన్ అడిగితే ఆమె అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో షారుక్ అసిన్‌ పేరెత్తితే పళ్లు నూరుతున్నాడట. ఆమెకు పోటీగా తమిళంలో నటిస్తున్న ఓ అందాల తారను తన తదుపరి చిత్రంలో నటింపజేయడానికి అనేక రకాలుగా యత్నాలు చేస్తున్నాడట. 

ఇందులో భాగంగా షారుక్ తన బ్లాగులో తన సరసన నటించేందుకు ఆసక్తిగల తమిళ హీరోయిన్లు సంప్రదించగలరు అని బహిరంగంగా ప్రకటన ఇచ్చేశాడట. ఇదిలావుంటే షారుక్ సరసన తెల్లపిల్ల తమన్నా అయితే సూపర్‌గా ఉంటుందని ఎవరో చెప్పారట. ఆ వార్త.. అలా.. అలా తమన్నా చెవికి చేరడంతో, ఆమె ప్రస్తుతం బాలీవుడ్ మేఘాలలో తేలిపోతోందట.

కోలీవుడ్ కోవాగా పేరుతెచ్చుకున్న తమన్నా, తన అందంతో శ్రేయ, అసిన్‌లను కోలీవుడ్ నుంచి తరిమికొట్టిందన్న వార్తలున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తమ బూట్లలో కాళ్లు పెడుతుందేమోనని శ్రేయ, అసిన్, త్రిష ఆందోళన పడుతున్నట్లు భోగట్టా.