ముంబయిలో సెటిలైన సమీరా రెడ్డి ఆనక హీరోయిన్గా మారి బాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ను సాధించుకున్నది. తాజాగా బుద్ధదేవ్ దాస్‌గుప్తా "కల్పురుష్" చిత్రంలో ఆమె నక్సలైట్ పాత్రను పోషిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలోని నక్సలైట్‌గా దర్శకుడు ఆమె పాత్రను చిత్రీకరిస్తున్నాడు. ఈ నేపధ్యంలో సమీరాను తెలంగాణా అంశంపై మాట్లాడమని అడిగితే... ఒక్కసారి అదిరిపడింది.