నా ఫిగర్‌ను చూసి నేనే ఈర్ష్య పడుతుంటా: అమృత
అతిథి చిత్రంలో మహేష్ బాబుతో నటించిన సెక్సీ హీరోయిన్ అమృతారావు తన ఫిగర్ ను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందట. ఆరోగ్య నిపుణులు ఇచ్చే సలహాల ప్రకారం మంచి డైట్ తీసుకోవడంతో పాటు స్విమ్మింగ్, వాకింగ్ అంటూ బాడీని ఫిట్‌గా ఉంచే వ్యాయామాలు చేస్తానంటోంది. అంతేకాదండోయ్.. ఫిట్‌గా ఉన్నటువంటి తన ఫిగర్‌ను చూసుకుని "ఎంత అందంగా ఉన్నానో" అని తనకు తనే ఈర్ష్య పడుతుంటుందట.
ఒక ఆర్టిస్టుతో లింకు పెట్టి వచ్చే వార్తలను చూసి ఆశ్చర్యపోతుంటానని చెప్పుకొస్తోంది. తనపై వచ్చే గాలి కబుర్లను ఎంతో ఇష్టంగా చదువుతానని చెపుతుందామె. "నా మీద రూమర్స్‌ని చదివి బాగా నవ్వుకుంటా. నేను ఏడ్వను. ఆ వార్తలను మా పేరెంట్స్‌కి చెప్పి పడీ పడీ నవ్వుతాను. గ్లామర్ ఫీల్డ్‌లో ఇటువంటివన్నీ సహజమే. నా కుటుంబ సభ్యులకు నా గురించి అంతా తెలుసు కాబట్టి ఎవరితో ఎన్ని లింకులు పెట్టి రాసినా పట్టించుకోరు. నా మీద వచ్చే పుకార్లను నమ్మనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తినే భర్తగా చేసుకుంటా. అంతేతప్ప ఏదో పిచ్చి రాతలు చూసి ఎగ్జైట్ అయ్యే మగాడిని నేను కోరుకోను" అంటోంది అమృతా.