Written By
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
లంగా- ఓణీ కట్టుకోవడం నాకు తెలీదు: హన్సిక
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ సరసన నటించనున్న తెల్లపిల్ల హన్సిక తనకు లంగా-ఓణీ కట్టుకోవడం తెలీదని చెపుతోంది. ఆ వస్త్ర ధారణ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ముంబయిలోని పల్లెటూరి ప్రాంతాలకు వెళ్లి తెలుసుకుంటున్నానని అమయాకంగా చెపుతోంది.
తన బాల్యమంతా నగరాల్లోనే గడిచిపోవడంతో లంగా-ఓణీలు కట్టుకున్న అమ్మాయిలు ఎలా ఉంటారో కూడా తనకు తెలియదని అంటోంది. ఇంతకీ ఈ లంగా-ఓణి గొడవ ఏమిటీ...? అనుకుంటున్నారా..?
షోయబ్ అక్తర్ సరసన నటించే సదరు సినిమాలో హన్సిక ఓ పల్లెటూరి పిల్లలా కన్పించాలట. ఆ చిత్ర నిర్మాత తన పాత్ర గురించి చెప్పినప్పుడు పెల్లటూరి వేషభాషలు తనకు తెలియవని చెప్పిందట హన్సిక. దాంతో సదరు దర్శకుడు ఆచార సంప్రదాయాలను కఠినంగా అమలు జరిగే ఓ మారుమూల పల్లెటూరు పేరు చెప్పి అక్కడ అమ్మాయిల కట్టూబొట్టూ చూసి నేర్చుకోమన్నాడట.
ఇక అప్పట్నుంచీ హన్సిక ఆ ఊరికి వీలుదొరికినప్పుడల్లా చెక్కెర్లు కొడుతోందట.