మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2014 (15:38 IST)

మా వాళ్లు స్కిన్ షో వద్దన్నా ఇక్కడ తప్పడంలేదు... ఆదాశర్మ

ఎవరైనా కథ డిమాండ్‌ను బట్టే ఎక్స్‌పోజింగ్‌, లిప్‌లాక్‌ అంటుంటారు. అదే మాటను ఆదాశర్మ చెబుతోంది. పూరీ 'హార్ట్‌ఎటాక్‌'తో వెలుగులోకి వచ్చిన ఈ భామ బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఛాన్స్‌ కొట్టేసింది. ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్‌గా ఈమె నటిస్తోంది. 
 
ఇటీవలే తన గురించి చెబుతూ... మొదట్లో సినిమాలంటే ఇంట్లో ఒప్పుకునేవారు కాదు. టీవీల్లో ఐశ్వర్య, మాధురీలను చూసి ఏక్టింగ్‌ నేర్చుకున్నాను. నా ఇంట్రెస్ట్ చూసి మావాళ్ళే వెళ్ళమన్నారు. అయితే గ్లామర్‌ ఫీల్డులో స్కిన్‌ షోకు ఒప్పుకోవద్దని చెప్పేవారు. 
 
కానీ ఇక్కడి కథలు బట్టి... అవసరాన్ని బట్టి తప్పడంలేదని అంటోంది. మరి అల్లు అర్జున్‌ సరసన ఎలా గ్లామర్‌ చూపిస్తుందో చూడాలి. త్వరలో ఈ చిత్రం సెట్‌ పైకి రానుంది.