ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2024 (14:33 IST)

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

road accident
అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అమెరికాలో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో గుజ‌రాత్‌కు చెందిన ముగ్గురు భార‌తీయ‌ మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం చెందారు. 
 
వివరాల్లోకి వెళితే.. ద‌క్షిణ క‌రోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలో ఆ ముగ్గురు ప్ర‌యాణిస్తున్న ఎస్‌యూవీ వాహ‌నం అదుపు త‌ప్పి ప్ర‌మాదానికి గురైంది. 
 
ఎస్‌యూవీ వాహ‌నం అన్ని లేన్ల‌ను దాటుకుంటూ.. 20 అడుగుల‌ ఎత్తులో గాలిలోకి వెళ్లింద‌ని, ఆ త‌ర్వాత స‌మీపంలో ఉన్న చెట్ల‌ను ఢీకొన్న‌ట్లు గ్రీన్‌విల్లే కౌంటీ పోలీసులు వెల్ల‌డించారు. 
 
ప్ర‌మాదంలో ఒక‌రు మాత్ర‌మే గాయాల‌తో బ‌య‌ట‌ప‌డి ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అతివేగమే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు తెలిపారు.