1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2024 (10:56 IST)

బ్లూవేల్ గేమ్‌‌కు అమెరికాలో భారతీయ విద్యార్థి బలి

whale
బ్లూవేల్ గేమ్‌ అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థిని పొట్టనబెట్టుకుంది. ఈ గేమ్ ఆడుతూ.. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం విద్యార్థి మార్చి 8న అతడు శవమై కనిపించాడు. 
 
బ్రిస్టల్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ప్రతినిధి గ్రెగ్ మిలియోట్ ఈ కేసును "ఆత్మహత్య"గా తేల్చారు. మృతదేహం అడవిలో కారులో కనుగొనబడింది.
 
ఆ విద్యార్థి పేరును బయటపెట్టని పోలీసులు... "బ్లూ వేల్ ఛాలెంజ్" అనే గేమ్ ఆడటం ద్వారా ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. కేసును ఆత్మహత్యగా భావించి దర్యాప్తు చేస్తున్నారు.