సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మార్చి 2024 (20:19 IST)

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం.. కిడ్నీ అమ్మేస్తానని?

Indian student
Indian student
అమెరికాలో భారత విద్యార్థులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు దాడులు.. మరోవైపు రోడ్డు ప్రమాదాల్లో భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఈ విద్యార్థి అమెరికాలో చదువుతున్నాడు. 
 
హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల అబ్దుల్ మహ్మద్ ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు గత మేలో ఇంటి నుంచి వెళ్లాడు. అబ్ధుల్ కుటుంబీకులు మార్చి 7 నుండి అతనితో మాట్లాడలేదని వాపోతున్నారు. అతను కిడ్నాప్ అయ్యాడని అబ్ధుల్ తల్లిదండ్రులకు కాల్ వచ్చింది. 
 
దోపిడీదారుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సుమారు లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే కిడ్నీ అమ్మేస్తానని బెదిరిస్తున్నట్లు అబ్ధుల్ తల్లిదండ్రులు తెలిపారు. 
 
అమెరికాలో ఉంటున్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.