అమెరికాలో కలవరపెడుతున్న భారతీయ విద్యార్థుల మృతులు... తాజాగా మరొకరు మృతి!!
అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గత వారంలో రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో విద్యార్థి చనిపోయాడు. వరుసగా సంభవిస్తున్న ఈ మృతులు అమెరికా అధికారులతో పాటు.. భారత రాయబార కార్యాలయ అధికారులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తాజా మృతి కేసు వివరాలను పరిశీలిస్తే, శ్రేయాస్ రెడ్డి బెనిగెరి అని విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో విగతజీవిగా కనిపించాడు. అమెరికాలో భారతీయ విద్యార్థి చనిపోవడం ఇది మూడోసరి. శ్రేయాస్ రెడ్డి మరణానికి కారణం తెలియాల్సివుంది.
కాగా, శ్రేయాస్ లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నాడు. శ్రేయాస్ మృతిపై న్యూయార్క్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతిని, అతని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలిపింది. కాగా, ఈ వారంలో వివేక్ సైనీ, నీల్ ఆచార్య అనే ఇద్దరు భారతీయ విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. తాజాగా మృతి చెందిన శ్రేయాస్ రెడ్డి మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియల్సివుంది.