సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (10:26 IST)

టిక్ టాక్‌కు భారీ షాకిచ్చిన అగ్రరాజ్యం అమెరికా!

tiktok
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్‌కు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాకిచ్చింది. ఇప్పటికే భారత్ కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఇదే బాటలో అగ్రరాజ్యం కూడా నిర్ణయం తీసుకుంది. చైనాలోని మాతృ సంస్థ బైట్ డ్యాన్స్‌తో టిక్ టాక్ సంబంధాలు తెంచుకోకపోతే యాప్‌పై నిషేధం విధిస్తామని హెచ్చరించింది. టిక్ టాక్‌ను ఏడాది లోపు మరో సంస్థకు విక్రయించాలంటూ అమెరికా దిగువసభ ఓ బిల్లుకు ఆమోదించింది. బిల్లుకు 360 సభ్యులు అనుకూలంగా, 58 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు బైట్ డ్యాన్స్ టిక్ ట్రాక్ నుంచి పెట్టుబడులు పూర్తిగా ఉపసంహరించుకోవాలని బిల్లులో పేర్కొన్నారు.
 
'చైనా ప్రతికూల ప్రభావం నుంచి అమెరికన్లను, ముఖ్యంగా అమెరికా చిన్నారులను కాపాడేందుకు ఈ బిల్లు రూపొందించాము. అమెరికన్ల ఫోన్లలో చొరబడ్డ ఓ నిఘా యాప్ ఇది' అని బిల్లు రూపకర్త, ప్రతినిధుల సభ సభ్యుడు టెక్సాస్ నేత మైఖేల్ మెక్కాల్ అన్నారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్లకు మరింత ఆర్థికసాయం అందించేందుకు ఉద్దేశించిన బిల్లులో భాగంగా టిక్క్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వచ్చే వారం ఈ బిల్లు ఎగువ సభ ముందుకురానుంది. తాను ఈ బిల్లుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా పేర్కొన్నారు.
 
కాగా, ఈ బిల్లును టిక్ టాక్ ఖండించింది. ఈ బిల్లుతో 170 మిలియన్ల మంది అమెరికన్ల భావప్రకటనా స్వేచ్ఛను అణిచివేస్తున్నారంటూ మండిపడింది. ఏడు మిలియన్ వ్యాపారాలకు ఈ బిల్లు అశనిపాతమని పేర్కొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా 24 బిలయన్ డాలర్ల ఆదాయం చేకూర్చే యాప్ పై వేటు వేస్తున్నారని పేర్కొంది. అయితే, ఈ బిల్లును టిక్ టాక్ కోర్టులో సవాలు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.