సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (11:36 IST)

అఖిల్ మాజీ ప్రేయసి శ్రియా భూపాల్ మరో అబ్బాయితో పెళ్లి...? రాజుగారి గదిలో నాగ్

సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ మామూలే. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటుంటారు. సినిమావాళ్ల ఇంటికి ఎవరు వచ్చిపోయినా లింకులు పెట్టేస్తుంటారు. ఒకరోజు రాత్రి పొరబాటును ఏదో స్నేహితుడే కదా అని నిద్రపోయారనుకోండి... ఇంకేముంది వాళ్ల మధ్య ఆ కార్యక్రమం కూడా జరిగిపోయి

సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ మామూలే. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటుంటారు. సినిమావాళ్ల ఇంటికి ఎవరు వచ్చిపోయినా లింకులు పెట్టేస్తుంటారు. ఒకరోజు రాత్రి పొరబాటును ఏదో స్నేహితుడే కదా అని నిద్రపోయారనుకోండి... ఇంకేముంది వాళ్ల మధ్య ఆ కార్యక్రమం కూడా జరిగిపోయిందంటూ ప్రచారం చేసేస్తుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్పులకు కొదవేమీ లేదు.
 
తాజాగా టాలీవుడ్‌లో మరో వార్త హల్చల్ చేస్తోంది. అదేంటయా అంటే... అక్కినేని అఖిల్ తో నిశ్చితార్థం చేసుకున్న శ్రియా భూపాల్ ఎన్నారైను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ వార్త సారాంశం. ఎన్నారై కుర్రాడిని పెళ్లి చేసుకునేందుకు శ్రియా భూపాల్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట. పెద్దలు కూడా ఓకే చెప్పేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అక్కినేని అఖిల్ మాత్రం కుదురుగా సినిమాలు చేసుకుపోయే పనిలో వున్నాడు.
 
ప్రేమికులు ఎలాగైనా కలుస్తారులే అనుకుంటూ ఎదురుచూస్తున్న నాగార్జునకు ఇది ఒకరకంగా షాకింగ్ న్యూసే. ఏం చేస్తారు... ప్రస్తుతానికి ఆయన కూడా రాజుగారి గది 2 చిత్రంలో బిజీగా వున్నారు. ఏదయినా సమస్య వచ్చినప్పుడు ఇలా బిజీ అయితే మైండ్ కూడా ఫ్రెష్ గా వుంటుంది కదూ...?!!