సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (21:32 IST)

అఖిల్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితోనో తెలుసా..?

అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నాడు. తొలిప్రేమ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తోన్నఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. డిసెంబ‌ర్ 3కి ఒక పాట మిన‌హా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. జ‌నవ‌రిలో రిలీజ్ అని ఎనౌన్స్ చేసారు కానీ.. డేట్ ఎప్పుడనేది ఎనౌన్స్ చేయ‌లేదు. 
 
ఇదిలాఉంటే.. అఖిల్ నెక్ట్స్ మూవీని త‌మిళ ద‌ర్శ‌కుడితో చేయ‌నున్నాడు అని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే.. విశాల్‌ హీరోగా ఇరుంబు తిరై (తెలుగులో అభిమన్యుడు) సినిమాను తెరకెక్కించిన పీయస్‌ మిత్రన్. ఇటీవ‌ల మిత్ర‌న్ అఖిల్‌కు లైన్‌ వినిపించాడ‌ని.. అది అఖిల్‌కి న‌చ్చ‌డంతో మిత్రన్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్తపై అఖిల్ స్పందిస్తాడేమో చూడాలి.