సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (17:05 IST)

'2.O' మూవీకి షాక్... తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌లో పైరసీ

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ - అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "2పాయింట్ఓ". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తేరుకోలేని షాక్ తగిలింది.
 
ఈ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీభూతం వెంటాడింది. తమిళ రాకర్స్ అనే వెబ్‌సైట్లో ఈ చిత్రం పైరసీ వీడియో అందుబాటులోకి వచ్చింది. ఈ హఠాత్పరిణామంపై చిత్ర నిర్మాతలతో పాటు యూనిట్ సభ్యులు తీవ్రఆందోళన చెందుతున్నారు. సదరు వెబ్‌సైట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ మండిపడుతున్నారు.
 
సుమారుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే, బయ్యర్లు కూడా భారీ మొత్తం వెచ్చించి చిత్రాన్ని కొనుగోలు చేశారు. ఈ చిత్రం ఓపెనింగ్స్‌పరంగా మంచి కలెక్షన్లు వస్తాయని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. గత చిత్రాల రికార్డులన్నీ ఈ మూవీ తిరగరాస్తొందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. 
 
ఇంతలోనే ఈ చిత్రం పైరసీ తమిళ రాకర్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రావడం ఇపుడు నిర్మాతలతో పాటు రజనీకాంత్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. అదీ కూడా హెచ్‌డీ రిజల్యూషన్‌లో దర్శనమివ్వడం ఇపుడు ఆందోళన కలిగించే అందంగా ఉంది.