ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 13 జూన్ 2017 (18:12 IST)

శ్రీదేవి రెండో కూతురుకి ఎంతైనా ఇస్తానంటున్న నాగ్...

అక్కినేని అఖిల్... హిట్టు కోసం ముఖం వాచిపోయేట్లు ఎదురుచూస్తున్నాడు. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ జనం చెప్పుకునే మాట. అక్కినేని అఖిల్‌కు ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. అందుకని ఓ మంచి కథతో హిట్టు కొట్టి తీరాలని అక్కినేని నాగార్జున కసితో వున్నారట

అక్కినేని అఖిల్... హిట్టు కోసం ముఖం వాచిపోయేట్లు ఎదురుచూస్తున్నాడు. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ జనం చెప్పుకునే మాట. అక్కినేని అఖిల్‌కు ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. అందుకని ఓ మంచి కథతో హిట్టు కొట్టి తీరాలని అక్కినేని నాగార్జున కసితో వున్నారట. ఐతే అఖిల్ సరసన ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్న హీరోయిన్లయితే లాభం లేదని తేల్చేసినట్లు సమాచారం. 
 
బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూస్తే శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ అయితే కరెక్టుగా సరిపోతుందని అంచనా వేసుకున్నాడట. సహజంగా రెమ్యునరేషన్ విషయంలో కాస్త గట్టిగా వుండే నాగ్... అఖిల్‌తో ఖుషి నటిస్తే ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధపడిపోతున్నారని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. మరి ఖుషీని శ్రీదేవి రంగంలోకి దింపుతుందో లేదో వెయిట్ అండ్ సీ.