అల్లు అర్జున్‌కు మరింత విశ్రాంతి కావాలట
సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే అల్లు అర్జున్.. తాజాగా దిల్‌రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. పూజ కూడా అయింది. సెట్‌పైకి ఈనెలాఖరులో వెళ్ళాల్సివుంది.
సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే అల్లు అర్జున్.. తాజాగా దిల్‌రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. పూజ కూడా అయింది. సెట్‌పైకి ఈనెలాఖరులో వెళ్ళాల్సివుంది. కానీ అనూహ్యంగా వచ్చేనెలలో చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. తనకు ఇంకాస్త రెస్ట్‌కావాలని అడిగినట్లు సమాచారం.
'సరైనోడు' తర్వాత చిత్రాన్ని చేయడానికి నాలుగు నెలలకుపైగా గ్యాప్ తీసుకున్నాడు. చిత్ర కథలోని అంశం బాగా నచ్చిందట. అయితే దాన్ని మరింతగా మాడిఫై చేయడానికి టైమ్ తీసుకోవాల్సిందిగా దర్శకుడికి సూచించినట్లు సమాచారం. సినిమా సినిమాకు విజయాన్ని దక్కించుకుంటూ.. ప్లాప్ సినిమా తీశావని పేరు తెచ్చుకోకుండా పలు జాగ్రత్తలు పడుతున్నాడు బన్నీ.