శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 నవంబరు 2016 (11:26 IST)

అల్లరి నరేష్‌కు సరసన నటించడమా.. నో.. నెవర్ : అమలాపాల్

హీరో అల్లరి నరేష్‌కు జోడీగా నటించేందుకు హీరోయిన్ అమలా పాల్ ససేమిరా అంది. పెళ్లి చేసుకున్న భర్తతో విడిపోయిన అమలా పాల్‌కు ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఈ భామ తెగ బిజీగా ఉంది. ఇప్పటికే మూడు తమిళ

హీరో అల్లరి నరేష్‌కు జోడీగా నటించేందుకు హీరోయిన్ అమలా పాల్ ససేమిరా అంది. పెళ్లి చేసుకున్న భర్తతో విడిపోయిన అమలా పాల్‌కు ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఈ భామ తెగ బిజీగా ఉంది. ఇప్పటికే మూడు తమిళ చిత్రాలు ఒక కన్నడ చిత్రాన్ని ఒకే చేసి చాలా బిజీగా ఉన్న ఈ భామకు అదేసమయంలో అల్లరి నరేష్ సరసన నటించమని ఆఫర్ రావడంతో అల్లరి నరేష్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఆ ఆఫర్‌ని తిరస్కరించిందట. 
 
దాంతో అమలా పాల్ కాకుండా మరొక హీరోయిన్ వేటలో పడ్డారు దర్శక నిర్మాతలు. తాజాగా 'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' చిత్రంతో వస్తున్నాడు అల్లరి నరేష్ దాని తర్వాత అనీష్ కృష్ణ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. అయితే, అల్లరి నరేష్‌తో నటించేందుకు అమలా పాల్ నిరాకరించడం ఇపుడు ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది.