ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 17 జులై 2019 (18:35 IST)

అందుకే ఇంకొకడిని ప్రేమించానంటున్న అమలా పాల్

ఇటీవలే అమలాపాల్ మాజీ భర్త రెండవ పెళ్ళి చేసుకున్నాడు. దీంతో అమలాపాల్ కూడా పర్సనల్ లైఫ్‌ గురించి ఓపెనైంది. తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. ఇంతకీ ఆమె ఎవరితో ప్రేమలో పడింది. అమలాపాల్ మళ్ళీ ప్రేమలో పడింది. ఇది సీక్రెట్ కాదు. గాసిప్ అంత కన్నా కాదు. నిజం. ఈ లవ్ మ్యాటర్‌ను అమలాపాల్ బయటపెట్టేసింది. అయితే తన ప్రియుడు పేరును మాత్రం బయటపెట్టనంటోంది. టైము వచ్చినప్పుడు చెబుతానంటోంది.
 
ఆయన నా జీవితంలో స్పెషల్ అంటూ చెబుతోంది అమలాపాల్. అమలాపాల్ గత యేడాది భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమె తమిళ దర్సకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్ళాడింది. కానీ యేడాది తిరగకముందే విడిపోయారు. విజయ్ చాలా మంచివాడు. కానీ మా రిలేషన్ బలపడకపోవడానికి కారణాలు ఉన్నాయి. నేను ఇప్పుడు తొందరగా పెళ్ళి చేసుకోవాలని మాజీ భర్త గురించి మంచి మాటలే చెబుతోంది అమలాపాల్.
 
ఆమె మాజీ భర్త తాజాగా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇన్నాళ్ళు తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడని అమలాపాల్. నాకు లవర్ ఉన్నాడు. కానీ పెళ్ళి విషయంలో తొందరపడనని చెబుతూ మరోసారి కేర్‌ఫుల్‌గా ఉంటానని చెబుతోంది.