మంగళవారం, 1 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (12:24 IST)

ఆయనకు చాలామంది పిల్లలు పుట్టాలి.. అమలాపాల్

''ఆమె'' (తమిళంలో ఆడై) సినిమా ద్వారా సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న అమలాపాల్.. తొలిసారిగా తన మాజీ భర్త, దర్శకుడు విజయ్‌పై కామెంట్లు చేసింది. ఎఎల్ విజయ్ ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహంపై అమలాపాల్ స్పందించింది. తాజాగా ఆడై ప్రమోషన్ కార్యక్రమంలో అమలాపాల్ మాట్లాడుతూ.. విజయ్ చాలా మంచి వ్యక్తి. ప్రేమగా చూసుకుంటాడు. 
 
కొత్త దంపతులకు చాలామంది సంతానం కలగాలని ఆకాంక్షించారు. ఇకపోతే.. అమలా పాల్ మాటలను బట్టి చూస్తే కొత్త చర్చ మొదలైంది. పిల్లల కోసమే ఈ జంట విడిపోయిందని టాక్ వస్తుంది. కాగా.. 2014లో విజయ్‌ను పెళ్లాడిన అమలాపాల్.. రెండేళ్ల తర్వాత విజయ్‌తో అమలాపాల్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 
 
అప్పటి నుంచి తమ తమ కెరీర్‌పై దృష్టి పెడుతున్న ఈ ఇద్దరు.. సినిమాలపై సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా ఆమె సినిమా అమలాపాల్‌కు ప్రత్యేక గుర్తింపును సంపాదించిపెడుతోంది.