శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 జులై 2019 (16:31 IST)

పోలవరం నిర్మాణంలో అవినీతి లేదు.. సీబీఐ విచారణకు నో ఛాన్స్ : కేంద్రం

పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందనీ, సీబీఐ విచారణ జరిపించాలంటూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగినట్టు తమకు నివేదికలు రాలేదనీ అందువల్ల సీబీఐతో విచారణ జరిపించే ఆలోచన ఏదీ లేదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టంచేశారు. 
 
సోమవారం పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, పోలవరం అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించే ఆలోచన ఉందా? అని నిలదీశారు. పోలవరం నిర్మాణానికి ఆర్థిక శాఖ నిధులను ఎప్పుడు విడుదల చేస్తుందని అడిగారు. నిధుల విడుదల కోసం అంచనాలను ఆర్థికశాఖకు పంపకుండా... రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీకి పంపించాల్సిన అవసరం ఏముందన్నారు. 
 
విజయసాయి ప్రశ్నలకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ, పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకున్నట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని ఆయన తెలిపారు. సీబీఐ విచారణకు అవకాశం లేదని స్పష్టంచేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.