శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 11 జులై 2019 (15:13 IST)

రోజమ్మకు కీలక పదవి, ఉత్తర్వలు జారీ చేసిన ప్రభుత్వం

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాకు కీలక పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా రోజాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ విస్తరణ అనంతరం నిరాశ చెందిన రోజాను పిలిచి సీఎం జగన్ మోహన్ రెడ్డి బుజ్జగించారు.
 
మంత్రివర్గంలోకి తీసుకోకపోవడానికి గల కారణాలు చూపించి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్ మాట ఇచ్చిన నేపథ్యంలో ఆమెను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేయడంలో అధికారికంగా పదవి చేపట్టనున్నారు రోజా. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించడంతో  రోజా సముచిత స్థానం కల్పించినట్టయింది. ఈ పదవిలో రోజా రెండేళ్లపాటు కొనసాగుతారు.