శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జులై 2019 (08:44 IST)

మీ పెంపుడు కుక్కను అదుపులో పెట్టుకోండి...బాబుకు నాని వార్నింగ్

విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్టీ అధినేత చంద్రబాబుకు ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి తనలాంటి వాడు కావాలంటే చంద్రబాబు పెంపుడు కుక్కను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో టీడీపీ నేత బుద్దా వెంకన్నకు, కేశినేనికి ట్విట్టర్ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో నాని సోమవారం ట్విట్టర్ లో  "నా లాంటి వాడు పార్టీ అక్కరలేదని చంద్రబాబు అనుకుంటే అది నాకు తెలియచేయాలి. అలా చెప్తే నేను నా ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. నా లాంటి వాడు పార్టీలో కొనసాగాలంటే చంద్రబాబు తన పెంపుడు కుక్కని కంట్రోల్ చేయాలి" అని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.