శనివారం, 26 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi

విజయ్ నుంచి విడిపోయిన అమలాపాల్ యంగ్ హీరోతో ఆ పనిలో ఉందా?

దర్శకుడు విజయ్ నుంచి విడిపోయిన తర్వాత అమలాపాల్‌పై అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ తనను సినిమాలకు దూరంగా ఉండాల్సిందిగా షరతులు పెట్టడంతోనే ఆతని నుంచి దూరమైందని ఓ వైపు ప్రచారం జరుగుతుండగా మరోవై

దర్శకుడు విజయ్ నుంచి విడిపోయిన తర్వాత అమలాపాల్‌పై అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ తనను సినిమాలకు దూరంగా ఉండాల్సిందిగా షరతులు పెట్టడంతోనే ఆతని నుంచి దూరమైందని ఓ వైపు ప్రచారం జరుగుతుండగా మరోవైపు అమలాపాల్ ఆమె భర్తతో విడిపోవడానికి ప్రధాన కారణం.. కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ యంగ్ హీరోతో జరిపిన ప్రేమాయణమేనని కోలీవుడ్ కోడై కూస్తోంది. 
 
ఇందుకే విజయ్ నుంచి ఆమె విడిపోయిందని... ఆతని నుంచి తప్పుకున్నాక అమలాపాల్  కోలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తోందని.. ఆ హీరో చలవతోనే ఈ భామకు కోలీవుడ్‌లో, టాలీవుడ్‌లో మంచి మంచి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా కూడా రాబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్‌లో కూడా మంచి పరిచయాలున్న ఈ హీరో.. అమలాపాల్‌కు అవకాశాలు అందించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెప్పుకుంటున్నారు. మరి ఈ హీరో ఎవరో తెలుసుకోలంటే వేచిచూడాల్సిందే.