1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Another surprise from RRR on Jr NTR Birthday

ఆర్ఆర్ఆర్ నుంచి మరో సర్ప్రైజ్?

surprise
ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ఒక సంచనలం. దర్సకుడు రాజమౌళి, ఇద్దరు ప్రముఖ హీరోలు సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ఇప్పటికే రిలీజైంది.
 
కానీ మరో టీజర్ త్వరలో విడుదల కానుందట. ఇప్పుడు ఈ విషయం మీద అభిమానుల మధ్య చర్చ జరుగుతోందట. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే వస్తుండటంతో అప్పుడు రావచ్చన్న అంచనాతో ఉన్నారట. రామ్ చరణ్ బర్త్ డే రోజు అల్లూరిగా చరణ్‌ను చూపించారు.
 
దీంతో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజు కూడా ఆయనపై మరో టీజర్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ నెల మే 20వ తేదీ జూనియర్ బర్త్ డే. చరణ్ టీజర్‌కు మించిన టీజర్ జూనియర్ ఎన్టీఆర్‌దే ఉంటుందన్న నమ్మకంతో అభిమానులు ఉన్నారు. కానీ ఇప్పటివరకు రాజమౌళి దీన్ని కన్ఫామ్ చేయలేదు.
About Writer
జె
తర్వాతి కథనం
సుడిగాలి సుధీర్ `గాలోడు`