మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (13:16 IST)

అంత‌ర్జాతీయ ప‌బ్లిసిటీకే ప్రాధాన్య‌త ఇచ్చిన అగ్ర హీరో

ఇప్పుడు మీడియా ఒక‌ప్ప‌టి మీడియాకు చాలా తేడా వ‌చ్చేసింది. సోష‌ల్‌మీడియా అంటే ఏమిటో తెలీని రోజుల్లో షూటింగ్‌కు సంబంధించిన విష‌యాలు లోక‌ల్ మీడియాకే హీరోలు, ద‌ర్శ‌కులు వెంట‌ప‌డేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. దీన్ని బాగా ఉప‌యోగించుకున్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళినే. అందుకే ఆయ‌న సినిమాల‌కు సంబంధించిన వివ‌రాలు ఎక్క‌డో అంత‌ర్జాతీయ మాధ్య‌మాల‌లో రావ‌డం వాటిని చూసి తెలుగు మీడియా రాసేసుకోవ‌డం జ‌రుగుతున్న‌ది కాద‌న‌లేని స‌త్యం. ఇప్పుడు అదే బాట‌లో యంగ్ టైగ‌ర్ అని పిలబ‌డ‌డే ఎన్.టి.ఆర్‌.కూడా వ‌చ్చేశాడు.
 
ఎన్‌.టి.ఆర్ .న‌టిస్తున్న తాజా సినిమా `ఆర్‌.ఆర్‌.ఆర్‌.`. ఈ సినిమా గురించి  ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ద‌స‌రాకు సినిమా విడుద‌ల అని కొద్దిరోజులు వార్త‌లు వ‌చ్చాయి. కానీ క‌రోనా వ‌ల్ల షూట్ ఆల‌స్యం కావ‌డంతో కాక‌పోవ‌చ్చ‌ని మ‌రో వార్త‌.. ఇలా ఎవ‌రికి తెలిసింది వారు రాసేసుకుంటున్నారు. ఈ విష‌యంలో ఎన్‌.టి.ఆర్‌. క్లారిటీ ఇచ్చేశాడు. ప్ర‌స్తుతం ఆయ‌న క‌రోనాబారిన ప‌డి క్వారెంటైన్‌లో వున్నాడు గ‌దా ఎలా ఇచ్చాడ‌నుకుంటున్నారా. అదెలాగో చూద్దాం.
 
క్వారెంటైన్‌లో వున్నా ఓ ఆంగ్ల ప్ర‌తిక పోన్ చేస్తే ఆయ‌న స్పందించాడు. స‌హ‌జ‌మేగ‌దా.. ఇక అస‌లు విష‌యానికి వద్దాం. డెడ్‌లైన్ అనే అంత‌ర్జాతీయ ప‌బ్లిషిక్ సంస్థ‌కు ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆర్‌.ఆర్‌.ఆర్‌. గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఏమ‌న్నాడంటే, 2018 న‌వంబ‌ర్‌లో సినిమా మొద‌ల‌యింది. క‌రోనా వ‌ల్ల 8 నెల‌లు ప‌ని మానేసి ఖాళీగా కూర్చున్నాం. ఆ స‌మ‌యాన్ని మిన‌హాయిస్తే 19 నెల‌లు ఆర్‌.ఆర్‌.ఆర్‌. కోసం ప‌నిచేశాం. ఈ సినిమా చాలా అద్భుతంగా వుంటుంది. యాక్ష‌న్ షూట్ ఒళ్ళు గ‌గుర్పాటు క‌లిగించేవిగా వుంటాయి. ఇక ఈ సినిమాను అక్టోబ‌ర్‌లో విడుల చేయడంప‌ట్ల విశ్వాసంతో వున్నాన‌ని చెప్పారు. మ‌రి పేన్ ఇండియా మూవీ క‌నుక అంత‌ర్జాతీయ మీడియాతో మాట్లాడిన‌ట్లుగా స‌న్నిహితులు చెబుతున్నారు.