శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (09:45 IST)

ఆర్ఆర్ఆర్: రామరాజు ఫర్ భీమ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తారక్! (video)

జక్కన్న, దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఏదైనా హిట్టే. బాహుబలి తరువాత అదే రేంజ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాం చరణ్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు పలు రికార్డులను క్రియోట్ చేస్తూ... సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ యూట్యూబ్‌లో ఓ సెన్సెషన్ క్రియోట్ చేశాడు. 
 
ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీమ్' వీడియో యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు మేకర్స్. దీంతో యూట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన మొట్టమొదటి తెలుగు టీజర్‌గా రికార్డు నెలకొల్పింది. 
 
ఫలితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటూ ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. దటీజ్ ఎన్టీఆర్ స్టామినా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.