అనుష్క ఇప్పుడు బరువు తగ్గాల్సిన అవసరం లేదు
'స్టార్ నటి అనుష్క శెట్టి మళ్లీ బరువు పెరిగింది. తగ్గేందుకు సిట్టింగ్స్ కోసం ఆస్ట్రియా వెళ్లింది' అంటూ తాజాగా ప్రచారమైంది. హైదరాబాద్ లో జరిగిన నిశ్శబ్ధం ప్రెస్ మీట్ స్కిప్ కొట్టడంతో స్వీటీపై ఈ తరహా ప్రచారం అభిమానుల్లో కలవరానికి కారణమైంది.
ఇది నిజమేనా అంటే తాజాగా అనుష్క తరపున ప్రతినిధులు స్పందించారు. స్వీటీపై జరిగిన ప్రచారం ఉత్తుత్తి ప్రచారమే. అందులో ఎలాంటి నిజం లేదు. అయినా అనుష్క ఈ ఏజ్ లో బరువు తగ్గాల్సిన అవసరం లేదు. తను ఇప్పటికే స్లిమ్ గానే ఉందని వివరణ ఇచ్చారు.
అంతేకాదు.. జనవరి చివరిలో తను నటించిన `నిశ్శబ్ధం` రిలీజవుతోంది. అప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రచారం చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు మీడియా మీట్ కి పిలవలేదట. ఇక తనపై జరిగిన ప్రచారం విషయంలో ఎలాంటి బాధను అనుష్క వ్యక్తం చేయడం లేదట.