ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 4 మే 2017 (14:55 IST)

ప్రభాస్ అంటే ఇష్టం.. అతన్ని వదిలివుండలేనంటున్న స్వీటి.. మూడుముళ్ళ బంధంతో ఒక్కటవుతారా?

స్వీటి అనుష్క తన మనసులోని మాటను వెల్లడించింది. తన పెళ్లి ప్రస్తావనపై ఎక్కడోచోట... ఏదో ఓ వార్త పత్రికల్లో వస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో దేవసేన తన మనసులో మాటను బహిర్గతం చేసింది. టాలీవుడ్ హీరో ప్రభాస్ అం

స్వీటి అనుష్క తన మనసులోని మాటను వెల్లడించింది. తన పెళ్లి ప్రస్తావనపై ఎక్కడోచోట... ఏదో ఓ వార్త పత్రికల్లో వస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో దేవసేన తన మనసులో మాటను బహిర్గతం చేసింది. టాలీవుడ్ హీరో ప్రభాస్ అంటే తనకు అమితమైన ఇష్టమని చెప్పుకొచ్చింది. పైగా, అతన్ని వదిలిపెట్టలేనని తేల్చి చెప్పింది. 
 
పైగా, భ‌విష్య‌త్తులో కూడా అవకాశం వస్తే అత‌నితో క‌లిసి సినిమాలు చేస్తాన‌ని వెల్లడించింది. ప్ర‌భాస్‌తో న‌టించే అవ‌కాశం వ‌స్తే ఎప్పుడూ వ‌దులుకోన‌ని చెప్పింది. ప్ర‌స్తుత్తం ప్ర‌భాస్‌కే చెందిన యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న‌ 'భాగ‌మ‌తి' సినిమాలో స్వీటి న‌టిస్తోంది. మ‌రి, భ‌విష్య‌త్తులో మ‌రోసారి అనుష్క‌, ప్ర‌భాస్ వెండితెర‌పై జంటగా క‌నిపించే రోజు ఎప్పుడొస్తుందో చూడాలి.
 
కానీ, సోషల్ మీడియాలో మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో అటు ప్రభాస్, ఇటు అనుష్క మొదటి స్థానంలో ఉన్నారు. అందుకే వీరిద్దరు మూడుముళ్ళ బంధంతో ఒక్కటి కావాలని నెటిజెన్లు కోరుకుంటున్నారు. ఇదే అంశంపై వారు తమకుతోచిన విధంగా ట్వీట్లు కూడా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభాస్ అంటే తనకు ఇష్టమని, అతన్ని వదిలిపెట్టలేనని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.