ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుంటే... కార్తీ మీసం జారిపోయింది....
తమిళ హీరో కార్తీ మలయాళ భామ నయనతార నటించిన తాజా చిత్రం 'కాష్మోరా' శుక్రవారం విడుదలైంది. ఈ హీరో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తమిళనాడులో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ థి
తమిళ హీరో కార్తీ మలయాళ భామ నయనతార నటించిన తాజా చిత్రం 'కాష్మోరా' శుక్రవారం విడుదలైంది. ఈ హీరో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తమిళనాడులో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. అయితే ఈ ప్రెస్‌మీట్‌లో కార్తీకు ఓ చుక్కెదురైంది.
మణిరత్నం డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ కాట్రు వెలీదాలో కార్తీ హీరోగా నటిస్తోండగా ఇందులో కార్తీ మీసం, గడ్డం లేకుండా నటిస్తున్నాడు. దీంతో కొన్నాళ్ళుగా ఇదే గెటప్‌లో కార్తీ ఉండగా, ఈ మధ్య జరిగిన ప్రెస్‌మీట్‌కి పెట్టుడు మీసంతో హాజరయ్యాడు. తాను మాట్లాడే సమయంలో మీసం కాస్త జారగా, ఈ విషయం తెలియని కార్తీ.... మైకు పట్టుకుని సినిమా గురించి ఉత్సాహంగా చెప్పుకుంటూ వెళ్లిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత మీసం నోటికి అడ్డుపడటంతో కార్తీ దానిని సరిచేసుకుని మళ్లీ ప్రెస్‌మీట్ కొనసాగించాడు. చాలా మంది హీరోలు ఇలా ఫేక్ మీసం, గడ్డాలతో ఫంక్షన్‌లకు హాజరైన సందర్భాలు లేకపోలేదు. కాని కార్తీకి సంబంధించి జరిగిన ఈ సంఘటన అన్ని కెమెరాలలో చిక్కడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సొంత మీసం లేకపోతే హీరోల పరిస్థితి అంత దారుణంగా ఉంటుందనడానికి నిదర్శనం ఈ ఘటన.