గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2016 (13:17 IST)

ఎన్టీఆర్ బయోపిక్.. ఫ్యాన్స్‌కు పండగ: బాలయ్య..జూ.ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారట..!

నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునే రోజులు దగ్గర పడుతున్నాయి. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్‌పై బయోపిక్ రానుంది. తెలుగు వాడి గుండెల్లో అటు నటుడిగా, ఇటు రాజకీయ నేతగా చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన

నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునే రోజులు దగ్గర పడుతున్నాయి. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్‌పై బయోపిక్ రానుంది. తెలుగు వాడి గుండెల్లో అటు నటుడిగా, ఇటు రాజకీయ నేతగా చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ జీవితంపై బయోపిక్ రానుంది.

ఎన్టీఆర్ జీవిత కథతో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. ఈ సినిమాకు వీలయితే సీక్వెల్ కూడా ఉంటుందని టాలీవుడ్‌లో టాక్ వస్తోంది. 
 
ఎన్టీఆర్ జీవిత కథతో సాగే ఈ సినిమాలో యూత్‌గా ఎన్టీఆర్ కనిపిస్తే .. ఆ తరువాత బాలకృష్ణ కనిపిస్తాడట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా నందమూరి హీరోల మధ్య ఉన్న విబేధాలు పటాపంచలు కానున్నాయని తెలుస్తోంది. ఇంతకీ ఈ సినిమాకు నిర్మాత ఎవరో తెలుసా..? నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకుని బాలయ్య, ఎన్టీఆర్ ఈ సినిమాపై దృష్టి పెడతారని సమాచారం.