మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: శనివారం, 6 ఫిబ్రవరి 2016 (13:13 IST)

అంజలి జపం చేస్తున్న బాలయ్య... 100లో కూడా అంజలికే ఛాన్స్...

తమిళంలో అవకాశాలతో పేరు తెచ్చుకుని తెలుగులోకి వచ్చిన నటి అంజలి. బాలయ్య పక్కన లెజెండ్‌, లయన్‌ చిత్రాల్లో అకవాశాలు వచ్చాయి. కానీ చివరి నిముషంలో డేట్స్‌ కుదరక చేయలేకపోయాననీ, డిక్టేటర్‌ అవకాశం వచ్చిందని చెప్పింది. ఆ షూటింగ్‌ నుంచి అంజలి, బాలయ్య మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. బాలయ్యను కూడా ఆమె తెగ పొగిడేసింది. దానికి తగినట్లు.. బాలయ్య తన వంద సినిమాకు అంజలిని రికమండ్‌ చేశాడు.
 
ఆదిత్య 999 సినిమాకు సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతోంది. సింగీతం శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కథకు సంబంధించినట్లుగా అచ్చమైన తెలుగు అమ్మాయి కావాలని ఆయన కోరడం.. వెంటనే బాలయ్య అంజలి పేరు చెప్పడం జరిగిందని సమాచారం. కాగా, ప్రతిష్టాత్మకంగా ఆదిత్య 369 సినిమాను తీసిన ఆయన.. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్‌ తీసుకున్నారు. వయస్సు కూడా వుంది. ఆయన శిష్యులు కూడా ప్రస్తుతం అందుబాటులో లేరు. మరి ఇంత పెద్ద కథకు.. ఆయన ఒక్కడే డీల్‌ చేయగలడా? లేదా? అనే అనుమానం కూడా వుందని కథనాలు విన్పిస్తున్నాయి.